సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పంచాయితీ నిధులు దుర్వినియోగం చేస్తూ, సర్పంచుల హక్కులు హరించి వేస్తుందని ఆరోపిస్తూ చేప్పట్టిన మహాధర్నా నిరసన కార్యక్రమానికి జనసేనా పార్టీ పొత్తులో భాగంగా మద్దతు తెలిపింది.చాల కాలంగా పొత్తు ఉన్నపటికీ తొలిసారి బీజేపీ జనసేన సంయుక్తంగా మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం, ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్వర్యంలో నేడు, గురువారం కలెక్టర్ కార్యాలయంవద్ద మహాధర్నాలో జనసేన క్యాడర్ బైకు ర్యాలీగా వెళ్లి పాల్గొని..పంచాయితీలకు పూర్వవైభవం తీసుకొనిరావాలని, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాలు, నిధుల మల్లింపులు మానుకోవాలని కోరుతూ కలెక్టర్ కు విన్నతి పత్రం అందించారు.
