సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాశము జిల్లా అద్దంకి వద్ద శంఖవరం పాడు వద్ద తమ కారులో గంజాయి మద్యం బాటిల్స్ ను తరలిస్తున్న ఇద్దరు పోలీస్ ఎస్ లు అనుకోకుండా ఒక ఆటోను ఢీ కొట్టడం తో అందులో 4 ప్రయాణికులు గాయపడటం జరిగింది. దానితో కోపోద్రిక్తులు అయ్యిన స్థానికులు ఆ కారు ను ఆపి చెక్ చెయ్యగా అసలు విషయం బయటపడింది అని మీడియాలో వార్తలు వీడియోలు హల్ చల్ అవుతున్నా నేపథ్యంపై.. ప్రతిపక్ష నేత , మాజీ సీఎం జగన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. హే రామ్,,! @ncbn గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం.ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా? అని జగన్ ప్రశ్నించారు.
