సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవర , పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, పి ప్రశాంతి ఓటర్ల జాబితా సం క్షిప్త సవరణ కార్య క్రమం పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ఈనెల 21 వరకు జరుగుతుందన్నారు. ఈనెల 22 నుంచి రేషనలైజేషనల్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జాబితాలను పరిశీలించి ఏమైనా అభ్యం తరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. బీఎల్ఓలు వారి పరిధిలో కేటాయించిన ఓటర్లను మాత్రమే విచారిస్తున్నారని వారి పరిధిలో ఇంకా ఇళ్లు ఉన్నా పరిశీలించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అడ్రస్లు మారిన , వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన , చనిపోయిన ఓటర్లకు సం బంధించి జాబితాలో పేర్లను తొలగించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ బీఎల్ఓ పరిధిలో ఓటర్ల జాబితాలో లేకున్నా ఆ ఓటరుకు ఎక్కడ ఇల్లుఉంటే అక్కడ వార్డులో ఓటు వేసేందుకు ప్రత్యేక విషయంగా పరిగణించి జాబితా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *