సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్,పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్ హీరోగా శ్రీరామచంద్రుని పాత్రలో ఓం రౌత్దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’ భారీ అంచనాల మధ్య విడుదలై టాక్ తో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 450 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో సినీ పరిశ్రమ నివ్వెరపోయింది. భీమవరం పట్టణంలో సైతం టోటల్ రన్ లో 1కోటి 27 లక్షలు వసూళ్లు చెయ్యడం అబ్బురపరిచింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకొంటున్న కోట్లాది ప్రేక్షకులకు శుభవార్త! నేటి శుక్రవారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో ఆదిపురుష్’ సినిమా 4కే క్వాలిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి గత గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *