సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వరాలయం లో ఈరోజు శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీ శ్రీ పద్దాలమ్మ భజన సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సప్తాహ మహోత్సవం రేపు ముగింపు నేపథ్యంలో నేడు, 6వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే కొయ్యే మోషేనురాజు దశాబ్దాలుగా కళను నమ్మనుకొన్న పౌరాణిక మరియు జానపద కళాకారులు ను శాలువాలు కప్పి సన్మానించారు, తదుపరి కళాకారులూ మోషేను రాజు ను సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆధునిక యుగం లో కూడా సాంప్రదాయ కళలను బ్రతికించడానికి కళాకారులు అంకిత భావంతో చేస్తున్న కృషిని కొనియాడారు, కేవలం డబ్బు కోసం కాకుండా ..ఆ పరమేశ్వరుని అస్సిసులతో..కళను భవిషత్తు తరాలకు అందించాలన్న వారి తపన కు మనమంతా ప్రోత్సహించాలన్నారు.
