సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రానున్న పండుగ వేళలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడపాలని, ప్రజలకు మాస్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న విషయాన్ని అధికారులు వివరించారు. కోవిడ్ సోకిన వారిలో ఎక్కువ మందికి పెద్ద స్థాయిలో కాకపోయిన స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ మేరకు హోం కిట్లో మార్పులు చేయాలన్నారు.మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని,104 కాల్ సెంటర్ను బలంగా ఉంచాలి. ఎవరు కాల్చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలి.సీఎం జగన్ ఆదేశించారు.
