సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచాలనే తెలుగు సినీ ప్రముఖుల డిమాండ్‌కు ఆర్జీవీ మద్దతు ప్రకటించారు.అంతే కాదు, జగన్ సర్కార్ కు మీడియా మాధ్యమాల ద్వారా తన వాదన బలంగా వినిపించారు. ఈ విషయంలో ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చిద్దామని నాని, వర్మకు నేడు, సోమవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు రాంగోపాల్ వర్మ పేర్ని నానితో సమావేశమయ్యారు. సమావేశంలో వర్మ సినిమా థియేటర్స్ టికెట్స్ రేట్లపై తనకున్న అవగాహన.. మధ్యేమార్గంగా ఎలా చేస్తే బాగుంటుంది అన్న సూచనలు చేసారని తెలుస్తుంది. ఆర్జీవీని భారీ బందోబస్తు నడుమ ఎయిర్‌పోర్టు నుంచి పోలీసులు వెలగపూడి సచివాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన కు మంత్రి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తదుపరి చర్చలలో పాల్గొన్నట్లు సమాచారం.. సమావేశానికి ముందు ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పేర్ని నానితో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తా. ఒక ఫిల్మ్ మేకర్‌‌గా మాట్లాడడానికి వచ్చాను. ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి వచ్చాను. ఎవ్వరేం మాట్లాడినా దాని గురించి నేను మాట్లాడను’’ అని ఆర్జీవీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *