సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మన తెలుగు రాష్ట్రాలలో వర్షాలు తగ్గాయి కానీ ఉత్తరాదిన ఇంకా కురుస్తూనే ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్ లో లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. హిమాచల్ రాజధాని సిమ్లా సహా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు జారిపడ్డాయి. శివాలయం ఘటనలో 9 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీసింది. సోలన్ జిల్లా కందఘాట్ సమీపంలోని మామ్లిగ్ వద్ద నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. శిధిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *