సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నాలుగవ, ఏ.పీ స్టేట్ మాల్కంబ్, 16వ ఏ.పీ స్టేట్ రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ .2023 ఛాంపియన్షిప్ పోటీలు భీమవరం S .c.h.b.r.m . హైస్కూల్ నందు నిర్వహించారు. ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్, కోయ్యే మోషేన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా క్రీడలు ర్యాంకుల కోసం కాదని, దేహదారుడ్యమ్ తోపాటు మానసిక ఉల్లాసంగా, క్రీడాకారులు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన మనోధైర్యంతో ముందుకు సాగుతారని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మాల్కంబ్, రోప్ స్కిప్పింగ్ క్రీడాకారులకు,విజేతలకు అభినందనలు తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా అడిషనల్ S.P. సుబ్బరాజు మాట్లాడుతూ.. వ్యయ ప్రయాసలతో ఎన్నో ఏళ్లుగారోప్ స్కిప్పింగ్, మాల్కంబు క్రీడలలో శిక్షణ ఇస్తు, ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్న జిపిసి శేఖర్ రాజు పిఈటి రామ్ బద్రి రాజులను అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ, స్కూల్ కరస్పాండెంట్ కూనపరాజు రామకృష్ణంరాజు, రంగసాయి, బహుమతులు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *