సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల విద్యు త్ బిల్లులు చెల్లించాలంటూ లేదంటే కరెం ట్ కట్ చేస్తామంటూ కొందరు మోసగాళ్లు పలువురికి మెసేజ్ లు లింక్ లు పంపుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని ఇకపై గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు, లింక్లు నమ్మి వినియోగదారులు మోసపోవద్దని భీమవరం డివిజన్ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఉండి మండలం పెదపుల్లేరులో జరిగిన ఓ సైబర్ మోసం జరిగిందని వివరించారు. కరెంట్ వినియోగదారులు ఈపీడీసీఎల్ వెబ్ సెట్ లో గాని ఫోన్ pay, గూగూల్ పే, పేటీయం , మీసేవా ద్వారా గాని లేదా కరెంట్ ఆఫీసు వద్ద ఉండే ఈఆర్ఓ కౌం టర్లో మాత్రమే బిల్లులు చెల్లిం చాలన్నారు.
