సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత దేశ 77 వ స్వతంత్ర దినోత్స వ వేడుకల సందర్భంగా రాజధాని అమరావతిలో ఉదయం శాసన మండలి ఆవరణంలో శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు,రాష్ట్ర పోలిసుల గౌరవ వందనం స్వీకరించి, మహాత్మా గాంధీ చిత్ర పటానికి పుష్ప వందనం చేసి.. మువ్వనేల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం లభించిందని అలాంటి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని నాయకులు, ప్రజలు, మన భారత దేశాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని కోరారు.
