సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రకటించారు. జిల్లాలో 535 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అక్టోబరు2వ తేదీ నుంచి నవంబరు 8 వ తేదీ వరకు గ్రామ సచివాలయం నుంచి స్టేట్ లెవెల్ వరకు ఐదు విభాగాలలో యువతీ, యువకులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాము అన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, యోగ, టెన్నికాయిట్, నడక, పరుగు పందెం, జాగింగ్, లెమన్ స్ఫూన్ తదితర పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనుటకు 17 సంవత్సరాలు దాటిన యువత మాత్రమే అర్హులని ఆమె ప్రకటించారు.
