సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ సిఫార్స్ తో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ కోటాలో నూతన ఎమ్మె ల్సీ లుగా నేడు, శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, మరియు డా. కుంభ రవిబాబు నేడు, శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి లోని ఆయన ఛాంబర్ లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్య క్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎమ్మెల్సీ లుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్య క్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు.
