సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో జనసేన అధినేత,పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో టీడీపీ తో కలసి జనసేన ఎన్నికలకు వెళ్లాలా ? లేక బీజేపీ తో కలసి మాత్రమే వెళ్లాలా? అన్నది ఇంకా చర్చల దశలో ఉందని అతి త్వరలో ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నానని తనదయిన శైలీ లో సస్పెన్సు కొనసాగించారు. ( అయితే టీడీపీ తో పొత్తు లో భాగంగా ఇప్పటికే వారాహి యాత్ర ల ఊపుతో జనసేన కు 40 సీట్లు కు సర్దుబాట్లు జరిగినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. మరో 5 సీట్లకు డిమాండ్ జరుగుతుందని … ) పవన్ మాట్లాడుతూ..ఏది ఏమైనా పొత్తులలో భాగంగా ఎన్నికలలో గెలిస్తే సీఎం పదవి ఇస్తే వదులుకోనని ప్రకటించారు. సీఎం జగన్ కు విశాఖపట్నం ప్రత్యేకమైన ప్రేమే కాదు భూములు మీదే మాత్రమే ప్రేమ. లా టైట్ పేరుతో బాక్సైటు, తవ్వుకొని పోయారు. బమ్మిడికలో ది లాటిరైట్ మైన్స్ వెనుక సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారు. మన్యం ప్రాంతంలో ఖనిజ దోపిడీ జరుగుతోంది. ఇక నుంచి తవ్వుకెళ్లిన మైనింగ్ కడప సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించారు అని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కూడా ఇదే తరహాలో సహజ వనరుల దోపిడీ చేస్తే తిరుగుబాటు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఆంధ్రావాళ్లను తరిమికొట్టడానికి వైఎస్ జగన్ కూడా కీలకమైన పాత్ర పోషించారు.” అని పవన్ కల్యాణ్ తనదయిన ధోరణిలో ఆరోపించారు. .
