సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ లో పెరుగుతున్న విద్యుత్తూ అవసరాల దృష్ట్యా కొత్తగా మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు బుధవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితం గా ఈప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాన్నారు.ఏపీ జెన్‌కో (AP Genco) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఎన్‌హెచ్‌పీసీ (NHPC) సంయుక్తంగా ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని యాగంటిలో 1000 మెగావాట్లు.. అనంతపురం జిల్లా కమలపాడులో 1950 మెగావాట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *