సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ భీమవరం బ్రాండ్, ఆలిండియా సినీ సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే .. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఫై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. 2 భాగాలుగా నిర్మిస్తున్న ఈ ఫాంటసీ సినిమాలో.. దీపికా పాడుకొనే తో పాటు ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ లాంటి ప్రముఖ సీనియర్ హీరోలు నటిస్తుండడం దుల్కర్ సల్మాన్, నాని వంటి యువ హీరోలు కూడా కీలక పాత్రలలో మెరవబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా దర్శక పర్యవేక్షణ చెయ్యడం తో పాటు కీలక పాత్రలో ప్రభాస్ తో కల్సి నటిస్తున్నాడనే టాక్ సినీ వర్గాలలో పెను సంచలనమ్ సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.గతంలో నాగార్జున తో తీసిన రాజన్న సినిమాకు రాజమోళి దర్శక పర్యవేక్షణ చేశారు. అయితే ‘కల్కి 2898 ఏడీ నిర్మాతల నుండి ఈ విషయం మీద అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *