సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి పేరి నాని నేడు, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్ టైమ్స్ కథనం పై చంద్రబాబు ఎందుకు ఖండించ లేదు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా?. చం ద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. ఎమ్మె ల్సీ పోతుల సునీతపై అవినీతి సొమ్ము అంటూ నారా లోకేశ్ ఇష్టానుసారం మాట్లాడారు. లోకేశ్ ముందు పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతిపై మాట్లాడాలి. లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్ పై దావా వేసే దమ్ముందా? ఐటీ నోటీసులపై కూడా చంద్రబాబు స్టే తెచ్చు కుంటాడు.చంద్రబాబు, లోకేశ్ ప్రజల సొమ్ము ను అడ్డం గా తినేశారు. మళ్లీ ప్రజల సొమ్ము ను తినేసేందుకు అధికారం ఇవ్వాలా? అని విమర్శించారు.
