సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఈ సెప్టెంబర్ నెలలో ప్రతి ఆది, సోమవారాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07453 లో నరసాపురంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి భీమవరం టౌన్ స్టేషన్ మీడియాగా మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌, 4.50కి లింగంపల్లి, 6.30కి వికారాబాద్‌ చేరుకుంటుందన్నారు. తిరిగి ఆదే రోజు సాయంత్రం 07454 నెంబర్‌తో వికారాబాద్‌లో సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నరసాపురం చేరుకుంటుందన్నారు. ఈ స్పెషల్ రైళ్లు గుంటూరు, నల్గొండ, సత్తినపల్లి మీదుగా నడుస్తాయన్నారు.పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు స్టేషన్‌లలో మాత్రమే ఆగుతాయి ప్రయాణికులు గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *