సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేడు, శుక్రవారం స్థానిక డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఎస్ వి ఎస్ ఎం ఈ పి సొల్యూషన్స్ విశాఖపట్నం వారిచే ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు సీఈఓ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. బిజినెస్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ సర్వీసెస్ను ఆర్కిటెక్చర్ మరియు కన్స్ట్రక్షన్లలో ఎంతో ప్రాముఖ్యం ఉందని అన్నారు. సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు విజయం సాధించాలని ప్రిన్సిపాల్, డాక్టర్ ఎం అంజన్ కుమార్ విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, స్టాప్, టీపీపు వెంకన్న నాయుడు మరియు ప్రొఫెసర్ డాక్టర్ హాసన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *