సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ దంపతులు లండన్ లో చదువుకొంటున్న తమ కుమార్తెలను కలవడానికి వ్యక్తిగత పర్యటన నిమిత్తం గత శనివారం రాత్రి 9:30 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంగ్లండ్ రాజధాని లండన్ కు బయలుదేరి వెళ్లారు. సీఎం జగన్ దంపతులు తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో సీఎం కు మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, పలువురు ఉన్న తాధికారులు వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *