సిగ్మాతెలుగు డాట్, న్యూస్: చంద్రబాబు అరెస్ట్ , జైలుకు పంపిన దరిమిలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పిలుపు నిచ్చిన బంద్ విఫలం అయ్యింది. ఆ బంద్ కు జనసేన కార్యకర్తల మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పటికీ .. చంద్రబాబు అరెస్ట్ అయితే,వర్తకుల షాపులు మనం మూయించడమేమిటి ? అని జనసేన క్యాడర్ కాస్త తెలివిగా అలోచించి టీడీపీ నేతలతో సంఘీభావం తెలపడం వరకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులలలో ఉత్తేజం నింపడానికి .. చంద్రబాబు వియ్యంకుడు మంచి మాస్ ఇమేజ్ ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బరిలోకి వచ్చారు.నేడు, మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని.. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు. ‘నేను వస్తున్నా.. నేనే ముందుంటా అంటూ భరోసా ఇచ్చారు. మన నేత చంద్రబాబు అరెస్ట్ తో జనం ఆలోచించాలి. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుంది. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. . జగనుకు మనుషులేంటేనే అలర్జీ.. ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు- విదిల్చే స్వభావం జగన్‌ది. రూ.10 ఇచ్చి.. రూ. 100 గుంజుకునే స్వభావం వైసీపీది. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగింది. ఒక్క ఓటంటూ అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేశారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం. ఇప్పుడే కాదు.. ఇంకా కేసులు పెడతారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. జగన్ లండన్ ఎందుకెళ్లారు? ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడంట.. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో..? ఇంకో ఆరునెలలు ఆగితే మనం అధికారంలోకి వస్తాం.. జగన్ అంతరిక్షంలో దాక్కున్నా అతని ని వదలం అని బాలకృష్ణ హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *