సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తన ఇద్దరు ఆడ పిల్లల విద్యాభాస్యం నేపథ్యంలో.. లండన్ వెళ్లిన సీఎం జగన్ దంపతులు.. పర్యటన ముగించుకొని నేటి మంగళవారం పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్నారు. వైసిపి శ్రేణులు ఆయనకు ఘన స్వగతం పలికాయి. జగన్‌కు స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు రన్ వేపై సీఎంకు జోగి రమేష్, పిన్నిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, వల్లభనేని వంశీ కొలుసు పార్థ సారథి, మల్లాది విష్ణు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్ మార్గాన తమ నివాసానికి సీఎం జగన్ బయలుదేరారు. సీఎం రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా పోలీస్ బందోబస్తుతో కట్టుదిట్టం చేశారు. తదుపరి తెదేపల్లి లోని తన కార్యాలయానికి చేరుకొని ప్రభుత్వ ముఖ్య అదికారులతో సమావేశం అయ్యి చంద్రబాబు అరెస్ట్ తదుపరి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఫై అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రేపు బుధవారం సీఎం జగన్ ఢిల్లీ లో పర్యటించనున్నారు. కేంద్రంలోని ముఖ్య నేతలతో సమావేశం అవుతారని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *