సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్లు జాబితా తయారీ ఫై వివరణ ఇస్తూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 2024, ఓటర్ల సవరణ జాబితా తయారీకి అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో తొలగించిన ఓటర్ల జాబితా సిద్ధం చేశామని తదుపరి ఇంటింటా ఎన్ని ఓట్లు ఉన్నాయో? పరిశీలన సమర్ధవంతంగా, పారదర్శకంగా చేశామని, ఎపిక్ కార్డుల ముద్రణ, పంపిణీ తదితర ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఎక్కడయినా ఒకే ఇంటి నంబరుపై 10ఓట్లు, అంతకు మించి నమోదై ఉంటే ఈనెల 15 నాటికి వాటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తామన్నారు. సమావేశంలో జేసీ ఎస్.రామసుందర్రెడ్డి, ఈఆర్వో లు కృష్ణవేణి, దాసిరాజు, ఎంఆర్ఓ ఎల్.నరసింహారావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *