సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. గం .. గం .. గణపతియే నమః .. మరో వారం లో శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా భీమవరం పట్టణంలో వాడవాడలా స్థానిక యువత ఆధ్వర్యంలో వందలాది చవితి పందిళ్ళ వేస్తున్న సందడి కనిపిస్తుంది. పందిళ్ళ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ మరియు భీమవరం మునిసిపల్ ప్రత్యేక అధికారి అయిన పి ప్రశాంతి.. పండుగను అందరూ ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకునే విధంగా పందిళ్లకు అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ , పొలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకొని గణేష్ విగ్రహాలు ఏర్పాటుకు, మండపాలు ఏర్పాటుకు, మైక్ లు ఏర్పాటు కు అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. భీమవరం పట్టణంలో జేపీ రోడ్డు, డి మార్ట్ ప్రక్కన పలు కూడళ్లలో పాటు ఉండి లోని గణపవరం రోడ్డు లో ఉన్న బొమ్మల తయారీ కేంద్రాల నుండి పెద్ద సైజు అందమైన శ్రీ వినాయక విగ్రహాలు 5వేల రూపాయలు నుండి 30వేల రూపాయలు ధరల వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వినాయకులు వాహనాలపై పందిళ్ళకు తరలి వెళుతున్నారు. ఎప్పటి లాగే భీమవరంలో వాడవాడలా భారీ స్థాయిలోఅందమైన పందిళ్లు వేసి పంచమ రాత్రులు, నవత్రులు, 11 రోజులు చప్పున వారి వారి అవకాశాలు బట్టి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా పట్టణంలో మెంటే వారి తోటలో గునుపూడి , స్థానిక గన్నాబత్తుల వారి వీధి, మోటుపల్లి వారి వీధి ,సుంకర పదయ్యా వీధి,దుర్గాపురం, శ్రీ శ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో , పలు అపార్ట్మెంట్స్ లో చక్కటి పందిళ్ళలో వినాయకులు 5 నుండి 10 అడుగుల వరకు భారీ విగ్రహ రూపాలలో పూజలు అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *