సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం లోని వీరవాసరం జెడ్పీటీసీ, జనసేనకు చెందిన గుండా జయప్రకాశ్ కు ఏలూరు స్పెషల్ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. జనసేన జెడ్పీటీసీ, గుండా జయప్రకాశ్ నాయుడ్ని ఏలూరు జిల్లా జైలుకు తరలించారు. వివరాలులోకి వెళ్ళితే.. 2019 ఎన్నికల్లో పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికారన్నఅభియోగంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. దానితో హైద్రాబాద్లో ఉన్న జయప్రకాష్ ను శృంగవృక్షం పోలీస్ అరెస్ట్ చేసి ఏలూరు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేడు, బుధవారం కోర్టు జయప్రకాశ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *