సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆవరణలో సీనియర్ నేత రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మెంటే పార్ధ సారధి ఆధ్వర్యంలో చెప్పట్టిన నిరాహార దీక్షకు రాష్ట PAC మెంబర్ కనకరాజు సూరి అధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు చేరుకుని దీక్ష చేస్తున్న రాష్ట్ర కార్యదర్శి మెంటే పార్ధసారధి,మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ మెఱగాని నారాయణమ్మ కి మరియు నాయకులకు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్ర శేఖర్ మాట్లాడుతూ .. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టును అయన ఖండించారు. ఈ కార్యక్రమంలో సుంకర రవి, మోకా శ్రీనివాస్, మాగాపు ప్రసాద్,రామాయణం శ్రీనివాస్,దారపురెడ్డి త్రివిక్రమ్ , పద్మా రావు, తదితర జనసేన నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *