సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక డి.యన్.ఆర్ కళాశాలలో నేడు, బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్ధులు వారి చదువుతోపాటు ఎప్పటికప్పడు సాప్ట్ స్కిల్స్ లేదా ప్రొఫెషనల్ స్కిల్స్ లలో అదనపు నైపుణ్యాని పొందాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి ఉంది అన్నారు. 10 వ తరగతి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన విద్యార్ధులు ఈ జాబ్ మేళా లో పాల్గొంటున్నందున వారందరూ తమ ప్రాధమిక అర్హత తోపాటు నైపుణ్యాలను అదనపు అర్హతగాగా చూపి పేరొందిన సంస్థలలో ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఇంత భారీ స్టాయిలో జాబ్ మేళాను ఏర్పాటు చేసినందుకు డి.యన్.ఆర్ కళాశాల యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంత కుమారి మాట్లాడుతూ .. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సహకారంతో భారీ స్దాయిలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడమైనదన్నారు. డి.యన్.ఆర్ పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు మరియు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. డి.యన్.ఆర్ విద్యాసంస్థలలో చదివిన విద్యార్ధులతో పాటుగా ఇతర విద్యాసంస్థలో చదివిన విద్యార్ధులు కూడా వారి వారి అర్హతల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సామాజిక బాధ్యత గా భావించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది అన్నారు. కళాశాల పాలక వర్గ ఉపాధ్యక్షులు జి. పాండు రంగరాజు మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాకు సుమారు 22 కంపెనీల నుండి ఎంపిక చేసుకునే ప్రతినిధులు హాజరు అయ్యారని ఉద్యోగాల కోసం సుమారు 1200 మంది విద్యార్ధులు తమ పేర్లను నమోదు చేయించుకుని ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారని అన్నారు.జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏ.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను డి.యన్.ఆర్. కళాశాల లో విజయవంతం అయ్యిందని ఈ జాబ్ మేళ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరోసారి డి.యన్.ఆర్ కళాశాలలో ఏర్పాటు చేయడానికి తమ సంస్థ తరుపున సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు కూడా జాబ్ మేళాలో అవకాశం కల్పించినందుకు దివ్యాంగులు హర్షం ప్రకటించారు. ఈకార్యక్రమంలో పాలకవర్గనికి చెందిన కె.రామకృష్ణంరాజు, జి.వి.యస్.ఆర్ నారాయణ, కె.శివరామరాజు, యన్.రామలింగరాజు, సిహ్.దత్తత్య్రేయ వర్మ, పి.రామకృష్ణంరాజు, కళాశాల అధ్యాపక, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు
