సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ తో కలసి పొత్తు తో జనసేన ముందుకు వెళుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేసారు. ఈ ప్రకటన నారా లోకేష్ మరియు నందమూరి బాలకృష్ణ సమక్షంలో మీడియా సమావేశంలో బిగ్గరగా ప్రకటించారు. ఇక బీజేపీ ఎలా స్వాందిస్తుందో ? వేచి చూడాలి . అంతకు ముందు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ కేసు లో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నా చంద్రబాబుతో ములాఖత్ కోసం జనసేన అధినేత రాజమండ్రి జైలుకి వెళ్లారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ముగ్గురూ జైలులోకి వెళ్లారు. జైలు ప్రధాన గేట్ లోపలి వరకు పవన్ కల్యాణ్ వాహనానికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.అయితే జైలు దగ్గరకు జనసైనికులు, టీడీపీ శ్రేణులు రాకుండా ఆంక్షలు విధించారు. కీలకమైన ములాఖత్ నేపథ్యంలో జైలు వద్ద అధికారులు ఆంక్షలు విధించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *