సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పడు కష్టంలో ఉన్న జనసేన అధినేత పవన్ బయటకు వస్తాడు.. వారు తోడుగానే ఎన్నికలలోకి దిగుతారు.. అని ఎన్నో ఏళ్లుగా వైసిపి నేతలు చేసిన విమర్శలు పరిపూర్ణంగా నిజం చేస్తూ నేటి రాజకీయ పరిణామాలు జరిగాయి... పవన్ కళ్యాణ్ మాటలలో.. చంద్రబాబు లాంటి సుదీర్ఘ రాజకీయ నేత , 3సార్లు ముఖమంత్రిగా పని చేసిన వ్యక్తిని అవినీతి కేసులో జగన్ సర్కార్ జైలు పాలు చేసిందంటే..రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు…చంద్రబాబును జైలుకు పంపడం చాల బాధగా ఉందని ..చంద్రబాబు కోసం తెలంగాణ నుండి వస్తున్నాతన లాంటి పాపులర్ వ్యక్తిని రాష్ట్రంలోకి రాకుండా 2వేల మంది పోలీసులతో అడ్డుకొన్నారంటే.. ఇక సామాన్య ప్రజలకు ఎంత కష్టం వచ్చిందోనని .. రాష్ట్రంలో ప్రతిపక్షం ను బ్రతకనియ్యరని, జగన్ దాటికి ఎవ్వరు తట్టుకోలేరని అర్ధం అయ్యిందని అందుకే ఇప్పుడే తెలుదేశం పార్టీ తో పొత్తు ప్రకటిస్తున్నానని ,అన్నారు. జగన్ తో సింగిల్ గా తలపెడితే ఏ పార్టీకి గెలుపు సులువు కాదని, అందుకే మాతో పాటు బీజేపీ కూడా జత కడితే మంచిదని సూచించారు. చంద్రబాబు అరెస్ట్ లో కేంద్రంలోని బీజేపీ పాత్ర లేదన్నారు. తాను టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి అండగా ఉంటానన్నారు. కుటుంబ సభ్యులకు బాసటగా నిలబడ్డారు. ఈ మేరకు బాలకృష్ణ లోకేష్ లతో కలసి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని జనసేనాని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఇక వచ్చే ఎన్నికలలో జనసేన గౌరవప్రదమైన ఎక్కువ సీట్లు పొత్తులో భాగంగా (టీడీపీ 100- జనసేన బీజేపీ కలపి 75..?) సాధించాలని జనసైనికుల ఆశలు నిజం కావాల్సివుంది.
