సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు కొయ్యే మోషేను రాజు చైర్మన్ గా ప్రారంభిస్తారు. కాగా దీనికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 20న సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అవుతుంది. అయితే ఈసారి అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ల తీవ్రత తప్పనిసరిగా ఉండనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *