సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నందమూరి కుటుంబం, బీజేపీ వ్యతిరేక ఇండియా కూటమిలోని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వంటి ప్రముఖులు సానుభూతి సంఘీభావం,సర్కార్ తీరును ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేస్తుంటే.. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు మాత్రం అసలు స్వాందించక పోవడంపై టీడీపీ లో కొన్నివర్గాలు మండిపడుతుండగా .. జూ. ఎన్టీఆర్ బీజేపీ తరపున భవిషత్తు రాజకీయ నేత గా రంగంలోకి దిగుతారని వార్తలు షికారు చేస్తున్నాయి. జూ. ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామయ్య నార్నె.. వైసిపి ఎంపీ అని అందరికి తెలిసిందే.. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ- జూనియర్ ఎన్టీఆర్‌కు ముడి పెడుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దానిలో.. ‘చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఖండించట్లేదు. దీన్ని బట్టి టీడీపీ భవిష్యత్ దబిడి దిబిడే ‘ అని సృష్టంగా తెలుస్తోంది.. అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకపోతె టీడీపీని ఉహించలేమ్మన అభిప్రాయం వర్మ వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *