సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో భక్తులకు అందించే నిత్యాన్నదానం ట్రస్ట్ కి స్థానిక భక్తులు వై వి సుబ్బయ్య గారి జ్ణాపకార్థం వారి భార్య వై వి మస్తానమ్మ రూ 1,00,116. కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ వీరికి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. నేడు అమావాస్య నేపథ్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో చండీహోమం నిర్వహించారు. 61 మంది భక్తులు పాల్గొన్నాగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో హోమం ఘనంగా జరిగింది. ధర్మ కర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *