సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్యరంగం విద్య లో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నేడు, సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సీఎం జగన్ నేడు, శుక్రవారం విజయనగరం నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించి ఇక్కడ వున్న వైద్య విద్యార్థులతో మాట్లాడారు. ఏలూరు మెడికల్ కళాశాలలో 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చేరడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 120 మంది అడ్మిషన్లు పొందారు. 2021 మే 31న సీఎం జగన్ వర్చువల్ విధానంలో ఏలూరు ఎమ్మెల్యే , మాజీ వైద్య శాఖ, మంత్రి ఆళ్లనాని సమక్షంలో శంకుస్థాపన చేశారు.. ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండేళ్లపాటు వైద్యవిద్యతరగతులు నిర్వహించడానికి తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేశారు. రూ. 220 కోట్లతో శరవేగంగా శాశ్వత మెడికల్ కళాశాల భవనాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్నారు.
