సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి రోజా నేడు, శుక్రవారం మీడియా తో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అమావాస్య రోజు చంద్రబాబు తో జైలులో పొత్తు డీల్, ప్యాకేజి ఫైనల్ చేసాడని తన ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను పవన్ తాకట్టు పెట్టాడని.. గతంలో చంద్రబాబు ను లోకేష్ లను అవినీతి పరులు, తన కుటుంబాన్ని అవమానించారు వారిని వదిలిపెట్టను అన్న పవన్ ఏ ముఖం పెట్టుకొని వారు ఇప్పడు నిజాయితీ పరులు అంటూ వారితో కలిసాడు ? అని ప్రశ్నించారు.గతంలో మా వైసీపీ వాళ్ళు చంద్రబాబు ను సీఎం చెయ్యడానికే దత్తపుత్రుడు వచ్చాడని అంటే చెప్పు చూపించిన పవన్ ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో చెప్పాలని, లేదా జనసైనికులు చెప్పాలని సవాల్ విసిరారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని పవన్.. సీఎం జగన్ ను ఎదో చేసేస్తానడం హాస్యస్వాదం అన్నారు. స్కిల్ కుంభకోణంలో పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు. అందుకే అడ్డంగా దొరికి జైలులో కూర్చున్న చంద్రబాబు కోసం రోడ్డు మీద డొల్లాడు అన్నారు. ఇక చంద్రబాబు నుండి పార్టీ పగ్గాలు తీసుకోని నడుపుదామని .. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపాడు. 13 చోట్ల చంద్రబాబు దొరికిపోయిన దొంగ. స్కిల్ కుంభకోణంలో కేంద్ర సంస్థలు ఐటీ, జీఎస్టీ, ఈడీలు విచారణలు జరిపి నిర్ధారించాయి. .ఇక బాలకృష్ణ.. తన తండ్రి మీద చెప్పు లేసిన చంద్రబాబునే ఏమీ చేయలేకపోయాడు. ఇక, సీఎం జగన్ను ఏం చేయగలడు?దత్తపుత్రుడు తన జనసైనికుల భవిషత్తు ఆలోచించకుండా బాలకృష్ణ లోకేష్ ల ముందు చేతులు కట్టుకొని పొత్తు డీల్ ఏకపక్షంగా ప్రకటించాడు. అని రోజా తనదయిన పంచ్ లు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *