సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొండపల్లి మున్సిపాలిటీలో రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నమాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.., జగన్ వర్గం వారు ఒక కుట్రతో ఇంకా టీడీపీ నేతలపై కేసులు పెట్టడానికి .. టీడీపీ అభిమానులు చేపట్టిన మేము సైతం నిరాహార దీక్షల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసినట్లు వీడియోలు విడుదల చేస్తున్నారు. వైసీపీ నేతలకు విషప్రచారం చేయడం అలవాటేనని.. అన్నారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నిద్రపోకుండా తరచూ శబ్దాలు చేయాలని అక్కడి సిబ్బందికి జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని దేవినేని ఉమా ఆరోపించారు. విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడంతో ఆ శబ్దాలకు నిద్రలేకుండా బాధపడుతున్న చంద్రబాబును సీసీ కెమెరాలలో చూసి జగన్ సైకో ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమా విమర్శించారు. శుక్రవారం, శనివారం, ఆదివారం వస్తే చాలు జగన్ నిద్రపోకుండా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని హింసించాలని ఆలోచించుకుంటూ కూర్చుంటాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే తొలి రెండేళ్లలో ‘జేసీబీ’లతో పాలన మొదలుపెట్టిన జగన్.. ఇప్పుడు అక్రమ అరెస్టులతో పాలన కొనసాగిస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *