సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన వెంటనే చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ రాష్ట్రంలో బంద్ కు బీజేపీ మద్దతు అంటూ పురంధరేశ్వరి లేఖ రాసినట్లు లేఖ రావడం .. కేంద్ర పెద్దలు ఆగ్రహం వ్యక్తం చెయ్యడం.. పురంధరేశ్వరి ఆ లేఖ తాను రాసింది కాదని ఫేక్ అని తెలపడం.. దీనిపై బీజేపీ ఎంపీ పివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు బీజేపీ సానుభూతి తెలపడం లేదని ఆయన అవినీతి అంటని నీతిమంతుడు ఏమి కాదని ప్రకటించిన నేపథ్యంలో తదుపరి పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు కు బీజేపీ కలసిరావాలని పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి నేడు, ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..ఇటీవల పలువురు టీడీపీ నేతలు పేర్కొంటున్నట్లు చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని అన్నారు. సిఐడీ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తోందని అన్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కు బీజేపీ మద్దతు ఇవ్వాలని పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదని, ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులును పవన్ కళ్యాణ్ తీసుకోనివెళతారని , దీనిపై కేంద్రం పెద్దలు మాతో చర్చలు చేసినసమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ఎంపీ పివిఎల్ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ..చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పు పట్టిందని, అరెస్టును ఖండిస్తున్నామని మేమే ముందుగా ప్రకటన చేశామని పురంధేశ్వరి పేర్కోవడం విశేషం…
