సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో ఈసారి వినాయకచవితి ఉత్సవాలు వేడుకలు జోష్ మరో లెక్కలో ఉండనుంది. అనేక మంది దాతలు ఇప్పటికే ఇండ్లలో పూజల కోసం ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణి చేస్తున్నారు. అయితే ఈసారి శ్రీ వినాయకుని అనుగ్రహంతో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే.. భీమవరంలో నియోజకవర్గాల పరిధిలో వాడవాడలా యువత ఏర్పాటు చేస్తున్న శ్రీ గణేష్ పందిళ్ళలో గతంలో స్థానిక దాతల సహకారంతో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించేవారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. రాజకీయ పార్టీలు ఈసారి శ్రీ గణేష్ భారీ విగ్రహాలు పందిళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం ముందు భారీగా యువత చేరుకొన్నారు. అంతకు మించి 3అడుగుల నుండి 8అడుగుల ఎత్తైన రంగురంగుల అందమైన భారీ వినాయక విగ్రహాలు ను గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ వాడవాడలా గణేష్ ఉత్సవాల నిర్వాహకులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం లో కామన నాగేశ్వరరావు, మానేపల్లి నాగన్న తదితర వైసిపి నేతలు పాల్గొన్నారు.లక్షలాది రూపాయలు విలువ చేసే వందలాది విగ్రహాలు పంపిణి నిర్వహిస్తున్నారు. తమ పందిళ్ళ ఎత్తు బట్టి 5వేలు నుండి 25వేలు విలువచేసే ఒకొక్క విగ్రహం ను తీసుకోని ఉచితంగా పట్టుకెళుతున్నపుడు యువత ఉత్సహం చూడాలి.. జై జై గణేశా.. ఇదే భీమవరం అంటే.. ఈ వినాయక చవితి రేంజ్ ఇక తగ్గదే లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *