సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఒక ప్రక్కమరో 7 నెలలు లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంతలో విగ్నాలు తొలగించే గణనాధుని వినాయక చవితి వచ్చింది. ఇక రాజకీయనేతలు శ్రీ వినాయకుని అస్సిసులతో రంగంలోకి దిగిపోతున్నారు. భీమవరం పట్టణ శివారులోని పెద్దమిరం లో ఉన్న ఎంపీ రఘురామా కృష్ణంరాజు నివాసం వద్ద జనసేన వీరవాసరం జడ్పీటిసి గుండా జయప్రకాష్ ఆధ్వర్యంలో జేపీ ఫౌండేషన్ సంస్థ తరపున నేడు, ఆదివారం ఉదయం భీమవరములో ఏర్పాటు చేస్తున్న శ్రీ వినాయక పందిళ్ళకు విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , ఉండవల్లి రమేష్ నాయుడు చేతులమీదుగా జయప్రకాశ్ ప్రారంభించారు. పలువురు విగ్రహాలను ఉత్సహంగా తమ పందిళ్ళకు తీసుకొనివెళుతున్నారు. పట్టణంలోని పలు ప్రెవేటు స్కూల్స్ లో కూడా శ్రీ వినాయకుడి చిన్న మట్టి విగ్రహాలను జేపీ ఫౌండేషన్ అందజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *