సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు ఆదివారం ఉదయం భీమవరం యనమదురు కాలవ గట్టు మీద ఉన్న L H టౌన్ హాల్ 83 వ వార్షికోత్సవం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ముఖ్య అతిధిగా విచ్చేసి టౌన్ హాల్ సబ్యులకు కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్రానికి పూర్వము అప్పటి ప్రముఖులతో ప్రారంభమై .. ఇంతటి సుదీర్ఘ కాలంగా టౌన్ హాలును చక్కగా నిర్వహించిన ఎందరో పెద్దలకు కార్యనిర్వాహకులకు అబినందనలు తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు.మెంటే పార్ధ సారధి, వేండ్ర వెంకటస్వామి తోట జగదీష్ వంటి ఎందరో ప్రముఖులు వ్యాపారవేత్తలు, పాల్గొన్నారు,
