సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కాలేజీ యొక్క 6వ Graduation Day “విష్ణోత్సవ్ 2K23” ను కళాశాల ఆవరణలోని శ్రీమతి. బి. సీతా ఇండోర్ ఆడిటోరియం నందు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2019-23 బ్యాచ్ కు చెందిన 783 మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు, అలాగే 2021-23 బ్యాచ్ కు చెందిన 19 మంది ఎం.టెక్. విద్యార్థులు మరియు 57 మంది MBA విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికేట్లను ప్రదానం చేయడం జరిగింది.శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, కె.వి. విష్ణు రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… గ్లోబెల్ విలేజి గా మారిన ఈ ప్రపంచం చాల విస్తరమైనదని .. అవకాశాలు కూడా ఎక్కువేనని,కేవలం ఉద్యోగాలపైనే దృష్టి పెట్టకుండా మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగే ఉన్నత ఆలోచనలను కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 859 మంది పట్టభద్రులు, అలాగే 2000 కుపైగా తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణు సొసైటీ వైస్-చైర్మన్ఆర్ రవిచంద్రన్ , విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
