సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో నేటి సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమౌతున్న శ్రీవారి బ్రమ్మోహోత్సవాలు లో పాల్గొనడానికి సీఎం జగన్ నేటి మధ్యాహ్నం నుండి తిరుమల చేరుకొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కు వగా ఉపయోగపడేలా..ఇవాళ అపూర్వముగా నిర్మించిన శ్రీనివాస సేతు ప్రారంభించి తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా అన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్, వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి ఇవ్వడం జరగనుంది. నాకు అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మం దికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరోమూడు వేల మందికి ఇస్తాం . ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లోపూర్తి చేస్తాం . తదుపరి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకొని తిరుమల కొండపైకి బయలు దేరి వెళ్లారు సీఎం జగన్
