సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మహిళాబిల్లు ఆమోదం పొందటంతో ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చెయ్యవలసిన అవసరం వచ్చింది. ఇకపై రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యత మరింతగా పెరగనుంది. ఎలాగు మగమహారాజులే వారి భార్యలను ఎన్నికలలో నిలబెట్టి చక్రం త్రిప్పాలని ఆలోచిస్తారు అన్నది నిజమే కానీ.. మహిళా ప్రాధాన్యత పెరిగితీరుతుంది. ఈ చట్టం వెంటనే అమలు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లకు 2 పార్లమెంట్ స్థానాలలో మహిళల కోసం 5 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు కచ్చితంగా కేటాయించాల్సిందే. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నమగ అభ్యర్థులు వచ్చే ఎన్నికలలో తప్పుకొని మహిళలకు త్యాగం చేయవల్సిందే.. మరో 7నెలలు లో రానున్న ఎన్నికలలో ఉమ్మడి పశ్చిమలో మరి ఏ సీట్లు మహిళలకు కేటాయిస్తారో అని ప్రస్తుత ప్రజాప్రతినిధులతో కొంత ఆందోళన మొదలయింది.ఇక భీమవరం నియోజకవర్గంలో మహిళా ఎమ్మెల్యే విషయానికి వస్తే స్వతంత్రం రాకముందు 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి భూపతిరాజు సుబ్బతాతరాజు సతీమణి భూపతిరాజు బంగారమ్మ మాత్రమే తొలిసారి ఎన్నికయారు.
