సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైకుంఠం తలపించేలా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వేడుకలు వీక్షించడం కోసం భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. నేడు, శనివారం ఆరో రోజున ఉదయం హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు. నేటి సాయంత్రం 4గంటల నుంచి స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారు అభయప్రదానం చేస్తారు. మహిళా భక్తులే స్వర్ణరథం లాగడం ప్రత్యేకత. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహన సేవలు జరగనున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన సాంసృతిక కళాకారుల ప్రదర్శనలు, వేషభాషలు విశేషంగా భక్తులను అలరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *