సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, శనివారం మీడియా కు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో.. చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కీములో 370 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఈ అవినీతిపై కేంద్రం సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ రాజకీయాలలో అవినీతి మరకలు అంటని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారని, సీఐడీ కంటే సిబిఐ బెటర్ అని అతని ఉద్దేశ్యాన్ని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ మద్దతుదారులు కొందరు తప్పుగా అర్ధం చేసుకొన్నారని అన్నారు. అయితే, పట్టుపడితే వదలని ఉండవల్లి పనిలో పనిగా.. ఇసుక, మట్టి, మద్యం వ్యాపారాలలో అవినీతిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అవినీతిపై సిబిఐ విచారణ కోరుతూ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. పోలీస్ కస్టడీలో చంద్రబాబు నాయుడుని విచారించడానికి 9 మంది అధికారులతో టీం ఏర్పాటు చేసారని,అయితే పోలీస్ కస్టడీలో చంద్రబాబు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని, విచారణను తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని పేర్కొన్న ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రఘురామ తెలిపారు.( కస్టడీలో తన అనుభవాన్ని గుర్తుచేస్తూ..) చంద్రబాబు తరపు న్యాయవాదులు అప్రమత్తంగా ఉండి, జగన్మోహన్ రెడ్డి వ్యూహం శపథం పసిగట్టినడుచుకోవాలి. సుప్రీంకోర్టులో ఎటువంటి వాయిదా లేకుండా చంద్రబాబుకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అని ఎంపీ రఘురామా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *