సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్ కీలక పాత్రలో కనిపించనున్నారని కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! స్టార్‌ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని అద్భుతంగ తెరకెక్కించిన ముఖేష్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వైరల్ అవుతోంది. అయిదు ఆరు కీలక సన్నివేశాలు 2 పాటలలో కనిపించే ప్రత్యేక పాత్రలో ప్రభాస్‌తో పాటు ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నట్లు తాజా వార్త.. అయితే ఈ చిత్రంలో వీరిద్దరూ శివపార్వతులుగా కనిపించనున్నారట.. ‘కన్నప్ప’ షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూలు లో న్యూజిలాండ్‌లో జరపనున్నారు.
