సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా లో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పందిళ్ళ లో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు నివాసాలలో చాల పందిళ్ళలో 5రోజులు 7 రోజుల వేడుకలు పూర్తీ కావడం తో జిల్లా వ్యాప్తంగా సుమారు 50 శాతం గణేశ విగ్రహాల నిమజ్జన వేడుకలు సందడిగా పూర్తీ చేసారు.. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రం భీమవరం లో పలు కాలనీల్లో వినాయకుడి వేడుకలు అంబరాన్నంటాయి. గత ఆదివారం పందిళ్ళ లో వినాయకులకు హారతి పూజలు ఇచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి గత ఆదివారం సాయంత్రం పందిరి మండపాల లో వినాయక విగ్రహాలను ఆబాల గోపాలం సందడి మధ్య యువకులు, తీన్మార్ డప్పుల మేళతాళాలతో వివిధ వాహనాలతో ఊరేగింపుగా ప్రధాన రోడ్ల వెంట తీసుకొనివెళ్ళి విస్సాకోడేరు కాలువ, లోసరి కాలువ జేపీ రోడ్డు అడ్డవంతెన వద్ద పంటకాలువ లోను, ఇంకా పలు కాలువలలో నిమజ్జనం చేసే కార్యక్రమం లో ఉత్సహంగా పాల్గొన్నారు. ప్రధాన రోడ్లు సందడిగా మారాయి. స్థానిక పోలీసులు భధ్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంకా అపార్ట్మెంట్స్ పలు పందిళ్ళలో 9 రోజులు, 11 రోజులు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *