సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొయ్యే మోషేను రాజు అడ్జక్షతన జరుగుతున్నా రాష్ట్ర శాసనమండలి సమావేశాలులో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో సనాతన హిందూ సంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించాలనే మహోన్నత ఆశయం తో పెద్ద ఎత్తున ప్రచార కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంకు అటువంటి పట్టింపులు లేవని అందుకే .. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లోసినిమా షూటింగ్ పెట్టి 31మంది మృతికి కారకుడైన చంద్రబాబు… తరువాత కృష్ణా పుష్కరాల సమయంలో అత్యంత దారుణంగా విజయవాడలో 23 ఆలయాలను కూల్చి వేశారని .. అయితే చంద్రబాబు ఆలయాలను కూల్చితే… సీఎం జగన్ వాటిని పునర్నిర్మిస్తున్నారని, అతి త్వరలోనే విజయవాడలో కొత్త ఆలయాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న 23,001 దేవాలయాలు, 1,742 ధార్మిక సంస్థలు, 133 మఠాల పవిత్రతను కాపాడేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు సీఎం జగన్ చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 32 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు సౌకర్యాల కోసం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నమని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో రాష్ట్రంలో రూ.296.20కోట్లతో 2,962నూతన ఆలయాలను రెండు దశల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ చర్చలో గోదావరి జిల్లాలకు చెందిన వైసిపి ఎమ్మెల్సీలు వంకా రవీం ద్రనాథ్, సత్యనారాయణరాజు, కల్పలత, పాకలపాటి రఘువర్మ , తోట త్రిమూర్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *