సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధికారంలోకి వస్తే ‘జగన్ కు భయం పరిచయం చేస్తా‘ యువగళం పాదయాత్రలో డైలాగ్స్ కొట్టిన నారా లోకేష్ .. తన తండ్రి చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలు లో పెట్టగానే టీడీపీ పార్టీని వదిలేసి తన అరెస్ట్ భయంతో ఢిల్లీ వెళ్లి దాక్కున్నాడని ..స్కిల్ స్కాం, ఏపీ ఫైబర్ స్కాం కేసులో అతనికి కూడా జైలు తప్పదని? సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్న నేపథ్యంలో.. తాజగా నేడు, మంగళవారం లోకేష్ ఫై మరో కేసు నమోదు అయ్యింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంటు కేసులో నారా లోకేష్‌ను 14 వ నిందితుడిగా చేరుస్తూ నేడు, సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కోర్టులో అధికారులు మెమో ఫైల్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును సీఐడీ అధికారులు నిందితుడిగా చేర్చారు. కాగా..నారా లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పు గోదావరి నుండి మరల ప్రారంభిస్తామని ఇటీవలే టీడీపీ క్యాడర్ కు భరోసా ఇచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *