సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేడు, వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు ఆయన వారికీ దిశా నిర్దేశం చేస్తూ.. .ఇప్పటి వరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలం మరో ఎత్తు వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మన పార్టీ 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో మన పార్టీ తో ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయి. మనం ముందుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే. కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు ..మరికొందరికి ఇవ్వకపోవచ్చు . మరో అవకాశం కల్పిస్తాం ’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *