సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిందీలో సన్నీ డియోల్ 20 ఏళ్ళ తరువాత గద్దర్ సినిమాకు స్వీకల్ సినిమా చేస్తే అది బాలీవుడ్ లో 600 కోట్ల మోత మ్రోగించింది. మరల సన్నీ ని టాప్ స్టార్ గా మార్చింది. మరి అదే స్పూర్తితో ..చిరంజీవి ని స్టార్ హీరో చేసిన ‘ఖైదీ’ సినిమా కు స్వీకల్ 38 ఏళ్ళ తరువాత రాబోతుంది అన్న తాజా సమాచారం ఇండస్ట్రీ ని షేక్ చేస్తుంది. భీమవరం ప్రజల వెటకారం మాటలలో మాటల మాంత్రికుడు గా మరియు అగ్ర సినీ దర్శకుడుగా ఎదిగిన త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారట. వీళ్లిద్దరి కాం బినేషన్ లోనే ఖైదీ కి సీక్వెల్ సినిమా రానుందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో ‘పగ తీర్చు కోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం ’ అనే డైలాగుతో ‘ఖైదీ’ సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఇదే లైన్ను స్టోరీగా తీసుకుని ఒక సినిమా ప్లాన్ చేయనున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వా త చిరంజీవి సినిమాను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారట. ఇక మెగాస్టార్ విషయానికొస్తే ప్రస్తుతం ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠతో ఒక సినిమా చేయనున్నా రు. ఫాంటసీ చిత్రం గా తీస్తున్నారు. దీనిలో కీలక పాత్రలో దగ్గుబాటి రానా నటించడం మరో హైలైట్..
